చైనాకి ఎక్కడో కాల్తోంది..!

రెండ్రోజుల పాటు ఢిల్లీలో జరిగిన జీ`20 దేశాల సదస్సు విజయవంతం కావడంపై చైనా అక్కసుగా ఉందా? ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటన విడుదల కావడాన్ని జీర్ణించుకోలేకపోతోందా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి భారత దౌత్య వర్గాలు.

Update: 2023-09-12 04:33 GMT

జీ-20 సదస్సు విజయవంతంపై కడుపు మంట

ఐఎంఈ కారిడార్‌పై సన్నాయి నొక్కులు

రెండ్రోజుల పాటు ఢిల్లీలో జరిగిన జీ`20 దేశాల సదస్సు విజయవంతం కావడంపై చైనా అక్కసుగా ఉందా? ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటన విడుదల కావడాన్ని జీర్ణించుకోలేకపోతోందా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి భారత దౌత్య వర్గాలు.

భారత ప్రధాని అధ్యక్షతన శని, ఆదివారాల్లో ఢిల్లీలో జీ-20 దేశాల సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ డుమ్మా కొట్టారు. తన ప్రీమియర్‌ లీ జియాంగ్‌ను పంపించారు. తన గైర్హాజరు వెనుక ఎలాంటి స్పష్టమైన కారణాన్ని ఆయన చెప్పలేదు. ఇది భారత్‌, చైనా మధ్య ఉన్న ఉద్రిక్తతలకు సాక్ష్యమని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. తను రాకపోవడం ద్వారా ఇతర దేశాలకు ఓ మెసేజ్‌ ఇవ్వాలనుకున్నారు చైనా అధ్యక్షుడు. కానీ ఆ లోటును ఎవ్వరూ పట్టించుకోలేదు. భారత ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి జీ-20 సదస్సును విజయవంతం చేశారు.

రష్యా, ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల మధ్య జీ-20 ఉమ్మడి ప్రకటన సాధ్యం కాదని అంతా అనుకున్నారు. కానీ ఉమ్మడి ప్రకటనను రూపొందించడంలో భారత ప్రభుత్వం విజయం సాధించింది. అలాగే 55 దేశాల ఆఫ్రికన్‌ యూనియన్‌ను జీ-20 దేశాలలోకి ఆహ్వానించడం కూడా భారత విజయమే. ‘ఇండియా`మిడిల్‌ ఈస్ట్‌`యూరోపియన్‌ ఎకనమిక్‌ కారిడార్‌(ఐఎంఈసీ)’ ప్రకటించడం జీ-20 సాధించిన అతి పెద్ద సక్సెస్‌. ఇది చైనా నిర్మిస్తున్న చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌కు పోటీగా భారత్‌  ప్రతిపాదించిన ఈ భారీ ప్రాజెక్ట్‌పై చైనాకు కడుపు మంట మొదలైంది.

‘దేశాల అభివృద్ధికి, మౌళిక వసతుల కల్పనకు తీసుకునే ఏ చర్యనైనా చైనా స్వాగతిస్తుంది. అయితే ఐఎంఈసీ ఓ భౌగోళిక, రాజకీయ సాధనంగా మారకూడదు’ అంటూ చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కానీ తాము నిర్మిస్తున్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ మాత్రం భౌగోళిక, రాజకీయ సాధనం కావడం గమనార్హం. ఆ శాఖ అధికార ప్రతినిధి మావో మాట్లాడుతూ ప్రపంచ దేశాల మధ్య సహకారం, శాంతి, అభివృద్ధి పెంపొందాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. తమ ప్రీమియర్‌ లీ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మధ్య జరిగిన స్వల్పకాలిక భేటీపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ‘చైనా అభివృద్ధి అమెరికాకు ఓ అవకాశమని, సవాల్‌ కాద’ని తాము బైడెన్‌కు చెప్పినట్లు ఆయన వెల్లడించారు  

Tags:    

Similar News