ఏపీ లో ఇక ఇక్కడ కర్ఫ్యూనే.. కేసులు పెరుగుతుండటంతో?

శ్రీకాళహస్తిలో అధికారులు అప్రకటిత కర్ఫ్యూ విధించారు. లాక్ డౌన్ ను పూర్తిగా అమలు చేయాలని నిర్ణయించారు. శ్రీకాళహస్తిలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇక్కడ యాభై కేసుల [more]

Update: 2020-04-24 02:14 GMT

శ్రీకాళహస్తిలో అధికారులు అప్రకటిత కర్ఫ్యూ విధించారు. లాక్ డౌన్ ను పూర్తిగా అమలు చేయాలని నిర్ణయించారు. శ్రీకాళహస్తిలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇక్కడ యాభై కేసుల వరకూ నమోదయ్యాయి. ఇది ఒక్కటే ఆందోళన కల్గించే అంశం కాదు. శ్రీకాళహస్తి నుంచి కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి వెళ్లిన వారి వల్ల తిరుపతిలో ఒకరికి కరోనా సోకింది. దీంతో శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్ డౌన్ ను విధించాలని అధికారులు నిర్ణయించారు. నేటి నుంచి ఉదయం ఆరు గంటల నుంచి 9గంటల వరకూ బయటకు వచ్చే మినహాయింపును రద్దు చేశారు. ఇళ్లల్లో నుంచి ఎవరూ బయటకు రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో పూర్తి కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News