వారం రోజుల గడువు

మహారాష్ట్రలో బలనిరూపణకు గవర్నర్ వారం రోజుల సమయం ఇచ్చారు. ఈరోజు ఉదయం దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ చేత ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ ఈ నెల 30వ [more]

Update: 2019-11-23 04:51 GMT

మహారాష్ట్రలో బలనిరూపణకు గవర్నర్ వారం రోజుల సమయం ఇచ్చారు. ఈరోజు ఉదయం దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ చేత ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ ఈ నెల 30వ తేదీలోగా బలాన్ని నిరూపించుకోవాలన్నారు. అయితే శరద్ పవార్ ఎన్సీపీ నిర్ణయం కాదని తెలిపారు. అది అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయమన్నారు. ఈరోజు మధ్యాహ్నం శరద్ పవార్, ఉద్దవ్ థాక్రేలు మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. అజిత్ పవార్ వెంట 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నారు. బీజేపీకి శాసనసభలో 105 మంది సభ్యులున్నారు. ఎన్సీపీకి 54 మంది సభ్యులున్నారు. ఈరెండు కలిస్తే మ్యాజిక్ ఫిగర్ కు ఢోకా లేదు. మరి ఎన్సీపీలో చీలిక వస్తే మాత్రం స్వతంత్ర సభ్యుల మద్దతు తీసుకోవాలని బీజేపీ యోచిస్తుంది. తమకు 170 మంది సభ్యుల బలం ఉందని బీజేపీ నేత గిరీష్ మహాజన్ తెలిపారు.

Tags:    

Similar News