ఐటీ దాడుల్లో బయటపడిన వెయ్యి కోట్లు
తమిళనాడులో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. బులియన్ ట్రేడర్, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జువెలరీ రిటెయిలర్‌పై జరిగిన ఈ దాడుల్లో ఏకంగా [more]
తమిళనాడులో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. బులియన్ ట్రేడర్, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జువెలరీ రిటెయిలర్‌పై జరిగిన ఈ దాడుల్లో ఏకంగా [more]
తమిళనాడులో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. బులియన్ ట్రేడర్, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జువెలరీ రిటెయిలర్‌పై జరిగిన ఈ దాడుల్లో ఏకంగా రూ.1000 కోట్ల అక్రమాస్తులు దొరికినట్లు ఆదివారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వెల్లడించడం గమనార్హం. అయితే ఎవరిపై దాడులు జరిగాయన్న విషయం మాత్రం సీబీడీటీ చెప్పలేదు. మార్చి 4న చెన్నై, ముంబై, కోయంబత్తూర్, మధురై, తిరుచిరాపల్లి, త్రిసూర్, నెల్లూరు, జైపూర్, ఇండోర్‌లలో ఏక కాలంలో 27 చోట్ల ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో లెక్కలు లేని రూ.1.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో మొత్తం వెయ్యి కోట్ల అక్రమ సంపాదన బయటపడినట్లు సీబీడీటీ స్పష్టం చేసింది.