రీడర్.. లీడర్.. రూలర్

సీఎన్ఓఎస్ తాజాగా విడుదల చేసిన సర్వే ఫలితాల్లో కేసీఆర్ నాయకత్వంపై 49 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నట్లు తేలింది.

Update: 2022-07-13 05:32 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలతో ప్రజలను తన వశం చేసుకుంటారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఆయనకు అదే పెద్ద ఆస్తి. ఆయన ప్రసంగం విన్నవారు ఫిదా అయిపోతారు. మాటలతో మాయ చేస్తున్నారనుకోవచ్చు. లేదా నిజాలను చెప్పి ప్రజలను చైతన్యపరుస్తున్నారనుకోవచ్చు. ప్రత్యర్థులు, ఆయనను సమర్థించే వారు ఎలాగైనా భావించవచ్చు. ముఖ్యమంత్రుల్లో అంత అలవోకగా మాట్లాడే నేత కేసీఆర్ అనే చెప్పుకోవాలి. స్క్రిప్ట్ లేకుండా రెండు, మూడు గంటలు అనర్గళంగా మాట్లాడగలిగిన నేత కావడంతోనే ఆయన వెంట జనం నడిచారు. అది మీడియా సమావేశం కావచ్చు. బహిరంగ సభ కావచ్చు. కేసీఆర్ ప్రసంగం అంటేనే అందరూ ఆసక్తిగా వింటారు. అంత అటెన్షన్ ను ఆయన తెప్పిస్తారు. అందుకే సీఎన్ఓఎస్ తాజాగా విడుదల చేసిన సర్వే ఫలితాల్లో ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ 11వ స్థానంలో నిలిచారు. ఆయన నాయకత్వంపై 49 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నట్లు తేలింది. 19 మంది మాత్రమే అసంతృప్తితో ఉన్ారు. 24 మంది తటస్థంగా ఉన్నారని సర్వే ఫలితాలు తెలిపాయి.

ఓడిపోవచ్చు... గెలవచ్చు...
రేపటి ఎన్నికల్లో గెలవచ్చు. ఓటమి పాలు కావచ్చు. ఒక నేతకు ఉండాల్సిన లక్షణం ప్రస్తుత పరిస్థితులపై అవగాహన ఉండటం. అందుకు ఆయన పుస్తక పఠనం హాబీగా చేసుకోవడమే కారణంగా చెబుతారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత దాదాపు అన్ని దినపత్రికలు చదవి దేశపరిస్థితులను ఆకళింపు చేసుకుంటారు. ఇంగ్లీష్, తెలుగు పత్రికలన్నీ చదివి రాజకీయ పరిస్థితులపై ఒక అవగాహనకు వస్తారు. కేవలం తెలంగాణలో తన ప్రభుత్వంపై వస్తున్న విమర్శలతో పాటు పొరుగు రాష్ట్రాలు, దేశ పరిస్థితులును పూర్తిగా తెలుసుకుంటారు.
అంకెలతో ఆటలు...
ిమొన్న జరిగిన మీడియా సమావేశంలో ఆయన చెబుతున్న అంకెలు, విషయాలు అనేక మందిని ఆశ్చర్యపరిచాయి. ఏ డ్యామ్ ఎంత సామర్థ్యంతో కట్టిందీ వివిధ దేశాల పేర్లతో అంకెలతో సహా చూడకుండా అలవోకగా చెప్పేయడం ఆయన విషయ పరిజ్ఞానానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఆర్థిక అంశాలపై కూడా కేసీఆర్ కు పట్టుంది. ఏ దేశం బడ్జెట్ ఎంత అనేది కూడా ఆయన ఇట్టే చెప్పేయగలరు. ప్రాజెక్టులతో పాటు దేశంలో ఎన్ని క్యూసెక్కుల నీరు సముద్రంలో వృధా పోతున్నదీ, దానిని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో ఆయన వివరించడం, అంకెలతో చెప్పడం అందరినీ ఆశ్చర్యపర్చింది.
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి...
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సబ్జెక్ట్ పై ఇంత కసరత్తు చేయకపోవచ్చు. ఇతర ముఖ్యమంత్రులు స్క్రిప్ట్ లేనిదే ప్రసంగించలేరు. అలాంటిది ఆయన అంకెలతో సహా అన్నింటినీ గుర్తుపెట్టుకుని చెప్పడం లీడర్ కు ఉండాల్సిన లక్షణమన్నది రాజకీయ విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు. కొందరికి కొన్ని అంశాలపైనే అవగాహన ఉంటుంది. కానీ కేసీఆర్ ఆర్థిక, సామాజిక అంశాలపై పూర్తి అవగాహన పెంచుకున్నారు. ఆ కారణంగానే ఆయన ఎన్ని గంటలైనా ఇట్టే అంకెలతో ఆటాడుకుంటూ మాట్లాడగలరని ఆయనను దగ్గర నుంచి చూసిన వారు చెబుతారు. అందుకే కేసీఆర్ రీడర్ గా ఉండటంతోనే లీడర్ అయి రూలర్ గా మారారన్నది వాస్తవం


Tags:    

Similar News