ఇంట్లో ఉన్నవి ఏమీ తినొద్దు.. తాగొద్దు
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటన నేపథ్యంలో ఇప్పడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఐదు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. వారిని ఇంటికి [more]
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటన నేపథ్యంలో ఇప్పడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఐదు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. వారిని ఇంటికి [more]
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటన నేపథ్యంలో ఇప్పడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఐదు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. వారిని ఇంటికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గ్యాస్ లీక్ కారణంగా ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను ఏవీ వాడవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఫ్రిజ్ లో ఉన్న వాటిని కూడా బయట పారేయాలని చెబుతున్నారు. ఐదు గ్రామాలను సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు. ఎండిపోయిన చెట్లను నరికివేస్తున్నారు. తాగునీటి కోసం ప్రత్యేక ట్యాంకర్లను సిద్ధం చేశారు. గాలిలో స్టెరిన్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని నిపుణులు చెబుతున్నారు. మంత్రుల బృందం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.