Liquor Sales : పూటుగా తాగేశారు...కోట్ల రూపాయల లిక్కర్ ను గుటుక్కున మింగేశారు

రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబరు నెలలో మద్యం ప్రియులు పూటుగా తాగేశారు. ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని తెచ్చి పెట్టారు;

Update: 2025-01-02 03:34 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబరు నెలలో మద్యం ప్రియులు పూటుగా తాగేశారు. ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని తెచ్చి పెట్టారు. డిసెంబరు నెలలో అత్యధికంగా అమ్మకాలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. తెలంగాణలో డిసెంబర్‌లో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ నెలలో 3,805 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. డిసెంబర్ 23 నుంచి 31 వరకే 1,700 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినట్లు తెలిపింది. డిసెంబరు 31వ తేదీ నాడు ఒక్కరోజు 402 కోట్ల రూపాయల మేరకు సేల్స్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెలలోనే పండగలతో పాటు సెలవులు కూడా రావడంతో అధికంగా సేల్స్ జరుగుతాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

వారం రోజుల్లోనే...
తెలంగాణలో గత ఏడాది డిసెంబరు నెలలో మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. డిసెంబర్ 1 నుంచి 31 వరకు 3,805 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా డిసెంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు అమ్మకాలు రోజు రోజుకూ పెరిగాయి. ఈ కొద్ది సమయంలోనే .1,700 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. 2023లో ఇదే సమయంతో పోలిస్తే 200 కోట్ల పెరుగుదల నమోదైందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 30న అయితే ఏకంగా సగటున రోజువారీ సేల్స్ కంటే రెండింతల ఎక్కువ అమ్మకాలు జరిగాయి. 23వ తేదీ నుంచి 31 వరకు రోజువారీగా మద్యం అమ్మకాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్ 23న 193 కోట్లు, డిసెంబర్ 24న197 కోట్లు, డిసెంబర్ 24న 197 కోట్లు, డిసెంబర్ 26న 192 కోట్లు, డిసెంబర్ 27న 187 కోట్లు, డిసెంబర్ 28న .191 కోట్లు, డిసెంబర్ 30న 402 కోట్లు, డిసెంబర్ 31282 కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ లోనూ...
అయితే మద్యం అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పోటీపడ్డాయి. ఏపీలో డిసెంబర్ 30వ తేదీన 219 కోట్లు విక్రయాలు జరగ్గా డిసెంబర్ 31వ తేదీన 113 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు. అలాగే తెలంగాణలో డిసెంబర్ 31వ రోజున 403 కోట్ల రూపాయల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 28 నుండి 1వతేద ఉదయం వరకే దాదాపు1800 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్పైజ్ అధికారులు తెలిపారు. ఏపీలో నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంతటి స్థాయిలో రికార్డు అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు మద్యం షాపుల నిర్వాహకులకు కూడా భారీగానే లాభాలు గత ఏడాది తెచ్చిపెట్టిందని చెప్పాలి. రూరల్, అర్బన్ ఏరియాలు అనే సంబంధం లేకుండా అమ్మకాలు విపరీతంగా జరిగాయని అధికారులు తెలిపారు.
Tags:    

Similar News