నిమజ్జనం ఎక్కడ?

హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం పై హైకోర్టులో విచారణ జరిగింది. వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించాలని మరోసారి హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశం జారీ చేసింది. నిమజ్జనం [more]

Update: 2021-08-18 12:53 GMT

హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం పై హైకోర్టులో విచారణ జరిగింది. వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించాలని మరోసారి హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశం జారీ చేసింది. నిమజ్జనం సందర్భంగా జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారను హై కోర్టు ప్రశ్నించింది. రసాయనాలతోకూడిన విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా చర్యలేమిటని హైకోర్టు నిలదీసింది. సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీలకు హైకోర్టు ఆదేశించింది. నివేదిక సమర్పించకపోతే సీనియర్ అధికారులు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. హుస్సేన్ సాగర్ లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిల్ పై విచారణ జరిగింది. వినాయక నిమజ్జనంపై తదుపరి విచారణ సెప్టెంబరు 1కి వాయిదా వేసింది.

Tags:    

Similar News