ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం

ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు.. నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు.. సీఎంఆర్ కాలేజీలో [more]

Update: 2021-02-11 01:27 GMT

ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు.. నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు.. సీఎంఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థిని కాలేజీ నుండి ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కింది. ఒంటరిగా ఉన్న విద్యార్థి ఆటో ఎక్కడంతో అదే అదనుగా తీసుకున్న ఆటో డ్రైవర్ జీడిమెట్ల పొదల్లోకి విద్యార్థిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు.. ఆ తర్వాత ఆటో డ్రైవర్ అర్థనగ్నంగా ఉన్న అమ్మాయిని రోడ్డుపైన వదిలేసి వెళ్లిపోయాడు..స్థానికులు, వాహనదారులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అమ్మాయిని మేడిపల్లిలో క్యూర్ హాస్పిటల్ కి తరలించారు. ఘట్ కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News