ఐటీ శాఖ మరో నివేదిక
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడులకు సంబంధించి పూర్తి నివేదికను ఆ శాఖ విడుదల చేసింది. పెద్ద సంఖ్యలో డైరీలు, రిజిస్టర్ లను [more]
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడులకు సంబంధించి పూర్తి నివేదికను ఆ శాఖ విడుదల చేసింది. పెద్ద సంఖ్యలో డైరీలు, రిజిస్టర్ లను [more]
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడులకు సంబంధించి పూర్తి నివేదికను ఆ శాఖ విడుదల చేసింది. పెద్ద సంఖ్యలో డైరీలు, రిజిస్టర్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. రెండు రోజుల క్రితం చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో దాడుల సందర్భంగా 2.63 లక్షల నగదు, కొద్ది మొత్తంలో బంగారం మాత్రమే లభ్యమయిందని పంచనామా నివేదికను విడుదల చేసిన ఐటీ శాఖ పూర్తి నివేదికను తాజాగా విడుదల చేసింది. విలువైన డాక్యుమెంట్లను కూడా వివిధ ఇన్ ఫ్రా కంపెనీల నుంచి సీజ్ చేసినట్లు పేర్కొంది. అంతేకాదు ఏవీ సుబ్బారెడ్డికి సంబంధించిన లాకర్లను కూడా సీజ్ చేశామని తన నివేదికలో ఐటీ శాఖ పేర్కొంది. ఇటీవల జరిపిన దాడుల్లో రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించామని ఐటీ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే.