బ్రేకింగ్ : 41 ఏళ్ల తర్వాత పతకం.. చరిత్ర సృష్టించారు

భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత్ హాకీ పురుషుల జట్టు ఒలంపిక్స్ కాంస్య పతకాన్ని సాధించింది. టోక్యో ఒలంపిక్స్ లో జర్మనీపై [more]

Update: 2021-08-05 03:29 GMT

భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత్ హాకీ పురుషుల జట్టు ఒలంపిక్స్ కాంస్య పతకాన్ని సాధించింది. టోక్యో ఒలంపిక్స్ లో జర్మనీపై గెలిచి ఈ ఘనత సాధించింది. 5 – 4 గోల్స్ తేడాతో భారత్ జర్మనీపై ఘన విజయం సాధించింది. నాలుగు దశాబ్దాల తర్వాత ఒలంపిక్స్ లో పతకాన్ని భారత హకీ పురుషుల జట్టు సాధించింది. భారత్ అద్భుతమైన విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చివరిసారిగా 1980లో మాస్కోలో జరిగిన ఒలంపిక్స్ లో భారత్ హాకీ టీం పతకాన్ని సాధించింది.

Tags:    

Similar News