పాక్ పై ఒత్తిడి పెంచుతున్న భారత్

పుల్వామా దాడిపై ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటించిన పాకిస్తాన్ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మరోసారి భారత్ సవాల్ చేసింది. పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్తాన్ [more]

Update: 2019-02-28 07:02 GMT

పుల్వామా దాడిపై ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటించిన పాకిస్తాన్ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మరోసారి భారత్ సవాల్ చేసింది. పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పాత్రపై ఆధారాలను పాకిస్తాన్ కు అందజేసింది. ఉగ్రదాడి తర్వాత జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కశ్మీర్ లోని ఉగ్రవాదులను అభినందించిన ఫోన్ టేపులను భారత్ పాకిస్తాన్ కు అందజేసింది. ఇప్పటికైనా మసూద్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఇక, పాక్ ఆధీనంలో ఉన్న భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ ను జెనీవా ఒప్పందం ప్రకారం వెంటనే విడుదల చేయాలని భారత్ కోరింది.

Tags:    

Similar News