ఇండియా ఇంటికే
సెమీ ఫైనల్స్ నుంచి ఇండియా ఇంటిదారి పట్టింది. ఇంగ్లండ్ బౌలర్లు, బ్యాటర్ల దెబ్బకు ఇండియా చేతులెత్తేసింది.
సెమీ ఫైనల్స్ నుంచి ఇండియా ఇంటిదారి పట్టింది. ఇంగ్లండ్ బౌలర్లు, బ్యాటర్ల దెబ్బకు ఇండియా చేతులెత్తేసింది. చెత్త బౌలింగ్, అంతకంటే చెత్తగా బ్యాటింగ్.. సెమీ ఫైనల్స్ లో చూడకూడని ఆట ఇండియా జట్టు చూపించింది. ఫలితంగా ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. వికెట్ పడకుండానే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించింది. ఇండియన్ బౌలర్లను ఇంగ్లండ్ బ్యాటర్లు ఒక ఆట ఆడుకున్నారు. గల్లీ క్రికెటర్ల తరహాలో ఇండియా ఆటగాళ్లను ఇంగ్లండ్ ప్లేయర్లు మార్చేశారు. ఒక్క వికెట్ పడకుండా ఇండియాను ఇంటికిపంపారు.
బ్యాటర్లు...
సూపర్ 12లో ఐదు మ్యాచ్ లో నాలుగింటిలో గెలిచి పాయింట్లలో అగ్రస్థానంలో నిలిచిన టీం ఇండియా కీలక సమయంలో చేతులెత్తేసింది. ఇంగ్లండ్ బ్యాటర్ల బాదుడికి చేష్టలుడిగి చూస్తుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎప్పటిలాగే కేఎల్ రాహుల్ త్వరగా పెవిలియన్ బాట పట్టాడు. ఇక రోహిత్ శర్మ కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో ఉండకుండా నిరాశపర్చాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుపులు చూపించలేకపోయాడు.
బౌలింగ్ పరంగా...
చివరకు కొహ్లి, హార్థిక పాండ్యాలు కుదురుకుని ఆడటంతో 168 పరుగులు చేసి ఏదో పరవాలేదనిపించింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు ఇద్దరూ ఉతికి పారేశారు. బట్లర్ 80 పరుగులు చేశాడు. హేల్స్ హేల్స్ 86 పరుగులు చేశాడు.ఇంకేముంది ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఇండియా ఇంటి దారిపట్టింది. ఫైనల్ లో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. చెత్త ఆటతో ఇండియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. పది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది.