నెట్టేశారు.. ఒంటరిగానే….!!

ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఒంటరి పోరుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు సిద్ధమయ్యాయి. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల గాను 6 నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. [more]

Update: 2019-04-22 06:19 GMT

ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఒంటరి పోరుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు సిద్ధమయ్యాయి. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల గాను 6 నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గ అభ్యర్థి ప్రకటన మాత్రం కాంగ్రెస్ పెండింగ్ లో ఉంచింది. ఇప్పటికే ఏడు నియోజకవర్గాలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. భారతీయ జనతాపార్టీ ఇప్పటి వరకూ ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీలు ఉదిత్ రాజ్, మీనాక్షి లేఖలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలను మాత్రం బీజేపీ పెండింగ్ లో ఉంచింది. దీంతో ఢిల్లీలో త్రిముఖ పోటీ నెలకొంది. వచ్చే నెల 12వ తేదీన ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News