మరాఠా రాజకీయాలపై

లోక్ సభలో మహారాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారంటూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ సభ్యులు [more]

Update: 2019-11-25 05:43 GMT

లోక్ సభలో మహారాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారంటూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. లోక్ సభ ప్రారంభమయిన వెంటనే మహారాష్ట్ర రాజకీయాలపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. రాహుల్ గాంధీ సయితం ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని లోక్ సభలో నినదించారు. పార్లమెంటు బయట సోనియా ఆందోళనకు దిగితే, లోక్ సభ లోపల రాహుల్ గాంధీ నిరసనకు దిగారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనల మధ్యనే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. రాజ్యసభలో కూడా ఇదే అంశంపై గందరగోళం చెలరేగింది. దీంతో రెండు సభలు వాయిదా పడ్డాయి.

Tags:    

Similar News