మళ్లీ రచ్చ రచ్చ

గాంధీ భవన్ లో మళ్లీ రచ్చ రచ్చ అయింది. సీనియర్ నేతలను అవమానపరుస్తున్నారంటూ వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సమక్షంలోనే వీహనుమంతరావు ఇతర [more]

Update: 2019-11-05 12:24 GMT

గాంధీ భవన్ లో మళ్లీ రచ్చ రచ్చ అయింది. సీనియర్ నేతలను అవమానపరుస్తున్నారంటూ వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సమక్షంలోనే వీహనుమంతరావు ఇతర నేతలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా షబ్బీర్ ఆలీని టార్గెట్ గా చేసుకుని వీహెచ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. తనను షబ్బీర్ ఆలీ రిటైర్డ్ పొలిటీషియన్ అని అన్నారంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న షబ్బీర్ ఆలీ మాత్రం తాను రెండు నెలల నుంచి ఎవరి గురించి ఏమాటా అనలేదని అన్నా కూడా వీహెచ్ ఊరుకోలేదు. కాంగ్రెస్ లో ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్నవారికి పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. దీంతో షబ్బీర్ ఆలి, వీహెచ్ ల మధ్య మాటల యుద్ధం పెరగడంతో గులాం నబీ ఆజాద్ జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.కాగా పీసీసీ చీఫ్ ను మార్చాల్సిందేనంటూ మరోనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఇప్పటికే వరస ఓటములతో క్యాడర్ డీలా పడిపోయిందని, పీసీసీ చీఫ్ ను మార్చకుంటే మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలవడం కష్టమేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News