మీకు రైలు టికెట్ ఉన్నా పెనాల్టీ వేయవచ్చు.. ఎలాగంటే..

ఇండియన్ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను అందించేందుకు ప్రతి నిత్యం చర్యలు చేడుతూనే ఉంటుంది. ఎవరైనా..

Update: 2023-08-14 10:23 GMT

ఇండియన్ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను అందించేందుకు ప్రతి నిత్యం చర్యలు చేడుతూనే ఉంటుంది. ఎవరైనా రైల్వే స్టేషన్ లకు వెళ్లి నిబంధనలు అతిక్రమించినట్లయితే వారికి జరిమానా విధిస్తారు రైల్వే అధికారులు. జరిమానాతో పాటు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. అయితే రైలు ఎక్కాలంటే ముందు టికెట్ తీసుకుంటాము. మరి కొందరు టికెట్ తీసుకున్నా చాలా సమయం వరకు స్టేషన్ లో ఉంటారు. అలా ఉండటం కూడా తప్పే. అలాగే కొందరు స్టేషన్లకు వస్తుంటారు. ఎందుకంటే ఇతరులను రైలు ఎక్కించేందుకు వస్తుంటారు. అలాంటి వారు ప్లాట్ ఫారమ్ టికెట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో నిబంధనలు పాటించకపోతే వారికి కూడా జరిమానా పడుతుందనే విషయం గుర్తించుకోవాలి. మరి కొన్ని నిబంధనల గురించి తెలుసుకుందాం రైలు మీ వద్దున్నప్పటికి జరిమాని విధించవచ్చు. ఎందుకలా టికెట్ ఉంటే జరిమానా విధించడమేంటనేగా మీ అనుమానం. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. అసలైన మీరు రైలు టికెట్ తీసుకొని రైలు కోసం వేచి ఉన్నట్లయితే, మీరు రైలు కోసం ఎంతసేపు వేచి ఉండవచ్చో కూడా కాల పరిమితి ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రయాణికులు టికెట్ తీసుకుని వేచి ఉండటం పగలు, రాత్రి సమయ వేళలు భిన్నంగాఉంటాయి.

ప్లాట్‌ఫారమ్‌పై రైలు వేచి ఉండే సమయం ఎంత?

మీ రైలు మధ్యాహ్నం సమయంలో మీరు రైలు వెళ్లే సమయానికి 2 గంటల ముందు రైల్వే స్టేషన్‌కు చేరుకోవచ్చు. మరోవైపు మీ రైలు రాత్రి అయితే, మీరు 6 గంటల ముందు ప్లాట్‌ఫారమ్‌కు చేరుకుని వేచి ఉండవచ్చు. అలాంటి సమయంలో ఎలాంటి పెనాల్టీ ఉండదు. కానీ మీరు ఈ సమయానికి ముందే ప్లాట్‌ఫారమ్‌కు చేరుకుంటే టీటీఈ మీ నుంచి జరిమానా వసూలు చేసే అవకాశం ఉంది. రైలు ప్రయాణం చేసేందుకు రైలు వచ్చే సమయానికి కంటే ముందుగా వచ్చిన టికెట్ తీసుకుని ప్లాట్ ఫారంపై వేచి ఉన్నా జరిమానా విధిస్తారని గుర్తించుకోండి.

ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ తప్పనిసరి:

మరోవైపు మీరు ఈ సమయ వ్యవధి కంటే ప్లాట్‌ఫారమ్‌పై ఎక్కువ సమయం గడపాలనుకుంటే, మీరు ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ తీసుకోవడం తప్పనిసరి. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ తీసుకున్న తర్వాత మీరు ఆ రోజు వరకు ప్లాట్‌ఫారమ్‌పై గడపవచ్చు. ఇందు కోసం టీటీఈ ఎలాంటి జరిమానా విధించరు. మీరు అలా చేయడంలో విఫలమైతే, మీరు జరిమానా చెల్లించాల్సి వస్తుంటుంది. భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌకర్యం కొన్ని నియమాలను రూపొందించింది. ఎవరైనా రైల్వే నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే జరిమానా విధిస్తారు. దీనితో పాటు శిక్ష విధించే అవకాశం ఉంది.

ఇలా రైలు ప్రయాణానికి గంటల ముందు వచ్చి స్టేషన్లో కూర్చున్నట్లయితే పెనాల్టీ ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎందుకంటే చాలా మంది ప్రయాణానికి ముందు స్టేషన్ కు వచ్చి టికెట్ తీసుకుని వేచి ఉంటున్నారని, దీని వల్ల ప్లాట్ ఫామ్ పై రద్దీ పెరిగిపోయి ఇబ్బందిగా మారుతుందని రైల్వే శాఖ గుర్తించింది. దీంతో ఇలా నిబంధనలు అమలు చేసినట్లయితే రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది. అందుకే ఈ నిబంధనలు తీసుకురావడానికి కారణం.

Tags:    

Similar News