మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కే విజయావకాశాలున్నాయని ఇండియా టుడే, మై యాక్సిస్ సర్వే తేల్చింది. మొత్తం్ 71 వేల మంది అభిప్రాయాలను సేకరించిన ఇండియా టుడే కాంగ్రెస్ కే ఎడ్జ్ ఉందని తేల్చింది. ఇండియా టుడే సర్వే ప్రకారం మధ్యప్రదేశ్ లో బీజేపీకి 102 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి 104 నుంచి 122 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పింది. బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్థానం నుంచి మూడు స్థానాల వరకూ సాధిస్తుందని, ఇతరులు ముగ్గురు నుంచి ఎనిమిది మంది వరకూ గెలిచే అవకాశాలున్నాయని చెప్పింది. అయితే ఈ సర్వే ఫలితాలు చూస్తే మధ్యప్రదేశ్ ను శివరాజ్ సింగ్ చౌహాన్ పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ తో పాటు యువనేత జ్యోతిరాదిత్య సింధియా హోరాహోరీగా తల పడ్డారు.