రమేష్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే

స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాద ఘటనకు రమేష్ ఆసుపత్రి యాజమాన్యమే కారణమని విచారణ కమిటీ తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పదిమంది ప్రాణాలు [more]

Update: 2020-08-19 13:54 GMT

స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాద ఘటనకు రమేష్ ఆసుపత్రి యాజమాన్యమే కారణమని విచారణ కమిటీ తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పదిమంది ప్రాణాలు కోల్పోవడానికి రమేష్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని చెప్పింది. కోవిడ్ వైరస్ సోకని వారిని కూడా ఆసుపత్రిలో చేర్చుకుందని నిర్ధారించింది. ప్రభుత్వ నియమ నిబంధనలను రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ఉల్లంఘించిందని పేర్కొంది. ప్రభుత్వ అనుమతి రాకముందే స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ ను రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిందన్నారు. అవసరం లేకున్నా ఖరీదైన రెమ్ డెసివర్ మందులను వినియోగించారని పేర్కొంది. ప్రభుత్వ అనుమతి లేకుండానే ప్లాస్మా థెరపీనిి కూడా నిర్వహించిందని తెలిపింది.

Tags:    

Similar News