ఇదిగో రాజధాని బాగోతం…ఇవిగో ఆధారాలు

రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నేతలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతి రాజధాని ప్రకటన రాకముందే భూముల కొనుగోలు జరిగింది. జూన్ [more]

Update: 2020-01-02 12:16 GMT

రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నేతలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతి రాజధాని ప్రకటన రాకముందే భూముల కొనుగోలు జరిగింది. జూన్ 2014 నుంచి డిసెంబరు 2014 వరకూ ఈ భూముల కొనుగోళ్లు జరిగాయి. గుంటూరు జిల్లాలో 2279, కృష్ణా జిల్లాలో 1789 ఎకరాలను అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పెద్దయెత్తున కొనుగోలు చేసినట్లు వీడియో ద్వారా చూపించారు. రాజధాని నూజివీడులో అని, నాగార్జున యూనివర్సిటీలో అని తప్పుడు ప్రచారం టీడీపీ నేతలు చేశారు. ఇందుకు తమ అనుకూల మీడియాను వాడుకున్నారు. 2014 జూన్, జులై, ఆగస్టు, సెప్టంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో రాజధాని ప్రాంతంలో మొత్తం 4,069 ఎకరాలు కొనుగోలు చేశారు. తాడికొండ గ్రామంలో 14 ఎకరాలు చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ కోసం కొన్నారు. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట కూడా దోపిడీ చేశారన్నారు. పయ్యావుల కేశవ్ కుమారుడు విక్రమసింహ పేరిట, వేం నరేందర్ రెడ్డి పేరిట 17 ఎకరాలను రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేశారు. రాజధాని మీద ఖచ్చితమైన సమాచారం ఉండబట్టే ఈ భూములు కొనుగోలు చేశారన్నారు. పల్లె రఘునాధరెడ్డి, కొమ్మాల పాటి శ్రీధర్ 68.6 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇవన్నీ రాజధాని ప్రకటన కు ముందే చేశఆరు. లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్, పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్, అల్లుడు శ్రీహర్ష కొనుగోలు చేశారు.

కుటుంబ సభ్యులు, బినామీలతో…..

యనమల రామకృష్ణుడు అల్లుడు ఏడు ఎకరాలు, కోడెల శివప్రసాద్ 17 ఎకరాలను రాజధాని ప్రకటన ముందే కొనుగోలు చేశారు. ప్రత్తిపాటి పుల్లారావు తన బినామీ సురేష్ పేరు మీద 38 ఎకరాలను కొనుగోలు చేశారు. దూళిపాళ్ల నరేంద్ర కూడా తన కూతురిపేరిట, బినామీ పేరు మీద 17 ఎకరాలు కొనుగోలు చేశారు. అప్పటి మంత్రులు పొంగూరి నారాయణ, రావెల కిశోర్ బాబులు ఇక్కడ కొనుగోలు చేశారు. జీవీ ఆంజనేయులు 57 ఎకరాలు రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేశారు. నారా లోకేష్ బినామీ వేమూరి రవి కూడా 67.7 ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. మరీ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే 8000 మంది తెల్ల రేషన్ కార్డుదారులు కూడా భూములను కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. అంతేకాదు తెలంగాణకు చెందిన 80 మంది తెల్లకార్డుదారులు కొనుగోలు చేశారు. తమ అనుయాయులకు లబ్డి చేకూర్చేందుకే సీఆర్డీఏ జోన్ పరిధిని మార్చారు. మాజీ ఎంపీ మురళీ మోహన్ 9 ఎకరాలు కొనుగోలు చేశారు. లింగమనేని రమేష్ తమ కుటుంబ సభ్యులు, సంస్థల పేరిట 351 ఎకరాలు కొనుగోలు చేశారు. నారాలోకేష్ సన్నిహితులు కొల్లి శివరాం, సురేష్ , బలుసు శ్రీనివాసరావులు దాదాపు 337 ఎకరాల అసైన్డ్ భూములను కొనుగోలు చేసి ప్లాట్లను పొందారన్నారు.

జైలుకు వెళ్లేందుకు…..

ఈసందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో భూములు తమ సన్నిహితుల చేత కొనుగోలు చేయించడమే కాకుండా, రాజధాని అభివృద్ధి పనులను కాంట్రాక్టులను కూడా సన్నిహితులకే అప్పగించారని వారు ఆరోపించారు. రాజధాని రైతులకు అన్యాయం చేసే ఆలోచన జగన్ కు లేదన్నారు. రాజధాని కోసం భూములు కావాలి కాని, భూముల కోసం రాజధానిని ఏర్పాటు చేశామన్నారు. రాజధాని అభివృద్ధిని చంద్రబాబు తన హయాంలో ఎందుకు చేయలేదన్నారు. రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారన్నారు. తాను చేసిన పాపం బయటపడుతుందనే ఆలోచనతోనే ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని వారు కోరారు. అమరావతిలో నిజమైన రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు.

Tags:    

Similar News