డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం… ఎమ్మెల్యేకు కూడా?

బెంగళూరు డ్రగ్స్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు . ఇప్పటికే డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న పలువురు కి నోటీసులు ఇచ్చి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. హైదరాబాద్ [more]

Update: 2021-04-19 00:55 GMT

బెంగళూరు డ్రగ్స్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు . ఇప్పటికే డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న పలువురు కి నోటీసులు ఇచ్చి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త తో పాటు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు కూడా బెంగళూరు పోలీసులు ప్రశ్నించారు .హైదరాబాద్ సిద్ధార్థ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ప్రజా ప్రతినిధులు కూడా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగానే ఒక ఎమ్మెల్యే తో పాటు ముగురు వ్యాపారవేత్తలు ఎనిమిదిమంది ఈవెంట్ మేనేజర ఇద్దరు సినిమా హీరోలతో పాటు కొంతమంది సినీ పరిశ్రమకు సంబంధించిన వారికి నోటీసులు జారీ చేసేందుకు బెంగుళూరు పోలీసుల రంగం సిద్ధం చేశారు. 2020 నుండి కర్ణాటక, తెలంగాణ లో కలిపి 36 కేసులు ఎన్సీబీ కేసు నమోదు చేసింది. 15 నెలల్లో 49 మంది ని నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకూ పట్టబడిన వారిలో 11 మంది హైదరాబాద్ కు చెందిన వారు.

Tags:    

Similar News