బిగ్ బాస్ టైటిల్ అబ్బాయిలకే పరిమితమా ?
అంతా బాగానే ఉంది.. కానీ గత 4 సీజన్లలో అబ్బాయిలే విజేతలు. ఈ సీజన్ లో కూడా సన్నీనే విజేతగా ప్రకటించారు. మరి అలాంటపుడు అమ్మాయిలను
బిగ్ బాస్ సీజన్ 5 నిన్నటితో ముగిసింది. గ్రాండ్ ఫినాలేను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు నిర్వాహకులు. దర్శకధీరుడు రాజమౌళి, ఆలియా భట్, రణ్ వీర్, జగపతి బాబు, నవీన్ చంద్ర, నిర్మాత శోభు, పుష్ప టీమ్ రష్మిక, సుకుమార్, డీఎస్పీ, శ్యామ్ సింగరాయ్ టీమ్ నాని, కృతిశెట్టి, సాయిపల్లవి, చిన బంగార్రాజు నాగచైతన్య తదితరులు గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథులుగా విచ్చేసి మరింత కళను తీసుకొచ్చారు. శ్రియ స్పెషల్ పెర్ఫామెన్స్ ఇచ్చి అందరినీ అలరించగా.. పలువురు సింగర్స్ తాము పాడిన పాటలనే గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై ఆలపించారు. టాప్ 5 నుంచి ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేస్తూ టాప్ 2 ని స్వయంగా హౌస్ నుంచి నాగార్జునే స్టేజ్ మీదికి తీసుకొచ్చారు.
నాలుగు సీజన్లుగా ఇదే..
కొద్దిసేపు టాప్ 2 కంటెస్టెంట్లను టెన్షన్ పెట్టిన నాగ్.. వీజే సన్నీని విజేతగా ప్రకటించగా.. షణ్ముఖ్ జశ్వంత్ రన్నరప్ గా నిలిచాడు. అంతా బాగానే ఉంది.. కానీ గత 4 సీజన్లలో అబ్బాయిలే విజేతలు. ఈ సీజన్ లో కూడా సన్నీనే విజేతగా ప్రకటించారు. మరి అలాంటపుడు అమ్మాయిలను హౌస్ లోకి ఎందుకు పంపిస్తున్నారు ? కేవలం అందాల ఆరబోతలకేనా ? బిగ్ బాస్ టైటిల్ అబ్బాయిలకే పరిమితమా ? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యతిరేకత చూపిస్తున్నారు. టాప్ 2 కంటెస్టంట్లలో అమ్మాయిలు ఉన్న సందర్భాల్లోనూ అబ్బాయినే విన్నర్ గా ప్రకటించారు. ఈసారైనా అమ్మాయికి ట్రోఫీ వస్తుందనుకుంటే.. టాప్ 5లో ఉన్న సిరిని కూడా ఎలిమినేట్ చేసేశారని కామెంట్లు చేస్తున్నారు.
వచ్చే సీజన్ లో అయినా మార్పులుంటాయా ?
నిజానికి బిగ్ బాస్ ఒక స్క్రిప్టెడ్ షో. ఈ విషయం చాలామందికి తెలుసు. టీఆర్పీ కోసం, హైప్ కోసం ఓటింగ్స్ ను పరిగణలోకి తీసుకోకుండానే.. చాలా మార్పులు జరుగుతుంటాయి. ఈ సీజన్ లో విశ్వ, రవిల ఎలిమినేషన్లతో అది నిజమేనని అంటున్నారు నెటిజన్లు. ఓటింగ్స్ తో సంబంధం లేకుండా ఎలిమినేట్ చేయడాలు, హౌస్ లో చివరివరకు అమ్మాయిలని గ్లామర్ కోసం ఉంచడాలు చేశారు. అమ్మాయిలకు ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ.. వాళ్లని కేవలం గ్లామర్ కోసమే షోకి వాడుతున్నారంటూ కొందరు బిగ్ బాస్ పై సీరియస్ అవుతున్నారు. తొలి సీజన్ శివబాలాజీ, రెండో సీజన్ కౌశల్, మూడో సీజన్ రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్ అభిజిత్ టైటిల్ తీసుకున్నారు. ఐదోసారి సన్నీ టైటిల్ గెలిచాడు. అమ్మాయిలు ఉన్నారంటే.. కెమెరాలకు ఫోజులివ్వడం, ఎవరో ఒకరితో రిలేషన్ పెట్టుకోవడం.. హగ్గులు, ముద్దులు ఇవన్నీ కావాలనే చేయిస్తున్నారని హౌస్ బయట ఉన్న టాక్. వచ్చే సీజన్ లో అయినా అమ్మాయిలకు కప్పు గెలిచే ఛాన్స్ ఇస్తారో.. లేక ఐదు సీజన్ల మాదిరిగానే గ్లామర్ కే పరిమితం చేస్తారో చూడాలి.