హోటల్ లో కోవిడ్ సెంటర్ కు అనుమతి ఉందా?

రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రయివేటు హోటల్ లో కోవిడ్ సెంటర్ ను నిర్వహించడానికి అనుమతి ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రయివేటు హోటళ్లను విదేశాల నుంచి [more]

Update: 2020-08-09 05:00 GMT

రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రయివేటు హోటల్ లో కోవిడ్ సెంటర్ ను నిర్వహించడానికి అనుమతి ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రయివేటు హోటళ్లను విదేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐలకు క్వారంటైన్ సెంటర్లు గానే వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే ప్రయివేటు హోటల్ లో కొద్ది మంది వైద్య సిబ్బందిని పెట్టి రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ఈ కోవిడ్ సెంటర్ ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో బెడ్స్ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఎక్కువ మంది ధనికులు ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. తమ ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీ లేకపోవడం, కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ఈ ప్రయివేటు హోటల్ ను తీసుకుని పక్కా వ్యాపారానికి తెరతీసిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News