ఏపీ కొత్త సీఎస్ ఈయనేనా?

ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా ఎవరిని నియమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యానాధ్ దాస్ ఈ నెలాఖరున రిటైర్ అవుతున్నారు. ఆయనకు ఇప్పటికే ఒకసారి పదవీకాలాన్ని [more]

Update: 2021-09-05 03:43 GMT

ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా ఎవరిని నియమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యానాధ్ దాస్ ఈ నెలాఖరున రిటైర్ అవుతున్నారు. ఆయనకు ఇప్పటికే ఒకసారి పదవీకాలాన్ని పొడిగించారు. మరోసారి పొడిగింపుకు అవకాశం ఉన్నప్పటికీ ఇంతవరకూ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయలేదు. దీంతో చీఫ్ సెక్రటరీగా మరొకరిని నియమించే అవకాశముంది. అయితే చీఫ్ సెక్రటరీగా ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న అజయ్ సాహ్ని, సీనియర్ ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, నీరబ్ కుమార్, జవహర్ రెడ్డి, సమీర్ శర్మలు ఉన్నారు. వీరిలో అజయ్ సాహ్ని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

Tags:    

Similar News