పరిటాలకు నో ఛాన్స్… వేరే వారికి పదవి

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవిని పరిటాల శ్రీరామ్ కు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు అనూహ్యంగా ఆయనను పక్కన పెట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన [more]

Update: 2021-01-12 02:02 GMT

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవిని పరిటాల శ్రీరామ్ కు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు అనూహ్యంగా ఆయనను పక్కన పెట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన బీసీ నేత జి. శ్రీరామ్ కు ఈ బాధ్యతలను అప్పగించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా జి.శ్రీరామ్ ను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీరామ్ ను తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఆయన గతంలో మదనపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు. చేనేత వర్గానికి చెందిన శ్రీరామ్ ను ఈ పదవికి ఎంపిక చేయడం విశేషం. దేవినేని అవినాష్ ఈ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఏడాదిన్నరనుంచి ఖాళీ గా ఉంది.

Tags:    

Similar News