వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర మరో మైలురాయి చేరింది. విశాఖపట్నం జిల్లా యలమంచిలి పట్టణంలోని కోర్టు సెంటర్ లో ఆయన 2800 కిలోమీటర్ల మార్క్ ను చేరుకున్నారు. అనంతరం పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. భారీ వర్షంలోనూ జగన్ పాదయాత్ర కొనసాగింది. జోరు వర్షంలోనూ సభకు భారీగా జనం తరలిరావడంతో, వర్షంలోనే జగన్ ప్రసంగించారు. మూతబడ్డ చెక్కెర పరిశ్రమలను తెరిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సెజ్, చెక్కెర ఫ్యాక్టరీల సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. బ్రాండెక్స్ కార్మికుల వేతనాలు పెంచేలా పరిశ్రమ వారితో మాట్లాడతానని హామీ ఇచ్చారు.