జగన్ పై హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై హత్యయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, [more]
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై హత్యయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, [more]
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై హత్యయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, తమకు ఆంద్రప్రదేశ్ పోలీసులు సహకరించడం లేదని, కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్పించాలని కోరుతూ ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఏ ఈ కేసును విచారణకు స్వీకరించి జనవరి 1వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే, తమకు ఉన్నతాధికారుల ఆదేశాలు లేవంటూ ఈ కేసును విచారించిన ఏపీ పోలీసులు కేసు ఫైల్స్ ఎన్ఐఏకి అప్పగించడం లేదు. దీంతో ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించింది. దీంతో పాటు ఈ కేసును విజయవాడ కోర్టుకు బదలాయించాలని ఎన్ఏఐ కోరింది.