పొలిటికల్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా
వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయడంతో... ఆంధ్రప్రదేశ్‌లో మరో కుటంబ కథా చిత్రం ప్రారంభమైంది. ఇప్పటివరకూ నందమూరి, నారా కుటుంబాల మధ్య నడిచిన ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు వైఎస్ కుటుంబంలోకి కూడా ప్రవేశిస్తున్నాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయడంతో... ఆంధ్రప్రదేశ్‌లో మరో కుటంబ కథా చిత్రం ప్రారంభమైంది. ఇప్పటివరకూ నందమూరి, నారా కుటుంబాల మధ్య నడిచిన ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు వైఎస్ కుటుంబంలోకి కూడా ప్రవేశిస్తున్నాయి. 2014 వరకూ అన్నతోనే నడిచిన వైఎస్ ముద్దుల కూతురు.. తర్వాత క్రమంగా వైకాపాకు దూరమయ్యారు. 2012లో జగన్ అరెస్ట్ తర్వాత ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ చెల్లి పాదయాత్ర చేశారు. 2014 ఎన్నికల్లో ఆమె జగన్ తరఫున ప్రచారం కూడా చేశారు. తర్వాత కాలంలో అన్న చెల్లెళ్ల మధ్య గ్యాప్ వచ్చింది.
2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వారిద్దరూ ప్రత్యర్థులుగా మారిపోయారు. జగన్ ప్రమాణ స్వీకారంలో కూడా షర్మిల కనిపించలేదు చివరకు తండ్రి సమాధి వద్ద కూడా వాళ్లు మాట్లాడుకున్న దృశ్యాలు కనిపించలేదు. రెండేళ్ల కిందట రాజశేఖరరెడ్డి భార్య విజయమ్మ వైకాపా గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడిరచారు. టీడీపీ అనుకూల మీడియా వైఎస్సార్ కుటుంబ విభేదాలను హైలైట్ చేయాలని ప్రయత్నించినా జనం పట్టించుకోలేదు. విజయమ్మ, షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడంతో జగన్ కుటుంబం రచ్చకెక్కలేదు. పదేళ్లుగా జగన్‌కు వ్యతిరేకంగా ఇద్దరూ ఎలాంటి ప్రకటనలూ చేయలేదు.
తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని వదులుకోవడం ఇష్టం లేక షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించారు. అక్కడ ఆమెకు పెద్దగా ఆదరణ లభించకపోవడంతో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో తన తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ)ని విలీనం చేసి ఏపీ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తున్నారు.
ఇకపై ఏపీ రాజకీయాల్లో మరో కుటుంబ వివాదం రచ్చకెక్కనుంది. ఎన్నికల టైంలో జగన్ పాలన మీద షర్మిల విమర్శలు చేయక తప్పదు. వాటిని తెలుగుదేశం మీడియా పెద్దక్షరాలతో ప్రింట్ చేస్తుంది. ‘పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి’గా విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, ఆయన మీడియాకు జగన్‌ను ఇరికించానికి ఓ గొప్ప అవకాశం దొరికింది. తన మూడు పెళ్ఠిళ్లను ప్రస్తావిస్తూ తనను చిరాకు పెడుతున్న పవన్‌కు కూడా పగ తీర్చుకోవడానికి ఓ గొప్ప అవకాశం దొరికింది. అలాగే షర్మిలకు వ్యతిరేకంగా కథనాలు రాయడానికి ‘సాక్షి’ ఉండనే ఉంది. ఇక రోజూ పేపర్లలో, టీవీ ఛానళ్లలో జగన్ కుటుంబంపై వారానికో సీరియల్, రోజుకో ఎపిసోడ్!