బిగ్ బ్రేకింగ్ : సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ కు బిగ్ రిలీఫ్ కానీ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. ఎన్నికల కమిషనర్ కు ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. [more]

Update: 2020-03-18 06:42 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. ఎన్నికల కమిషనర్ కు ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ ను ఎత్తివేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం తాను ప్రకటించిన పథకాలను అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఎన్నికలను వాయిదా వేయడం మాత్రం అది చీఫ్ ఎన్నికల కమిషనర్ దేనని చెప్పింది. ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేది ఈసీ ఇష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికలు వాయిదా వేసినా ఎన్నికల కోడ్ ను ఎత్తివేయమని సూచిచండంతో జగన్ సర్కార్ కు ఇళ్లస్థలాల పంపిణీ వంటి విషయాల్లో వెసులుబాటు కలిగినట్లయింది. కొత్త పథకాలను ప్రకటించే విషయంలో మాత్రం ఎన్నికల అధికారి అనుమతి తీసుకోవాలని పేర్కొంది.

Tags:    

Similar News