కాలం చెక్కిన కఠిన శిల

సాధారణంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా 30% మంది సిటింగ్ అభ్యర్ధులని మార్చేయడం అనేది జరగదు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ మాత్రం సంకోచించకుండా సిటింగ్ లకు నో చెబుతున్నారు. ఓ కొత్త తరహా రాజకీయానికి తెర తీస్తున్నారు. బంధాలు, బంధువులు, అయిన వాళ్ళు, స్నేహితులు, సామాజిక వర్గ సమీకరణాలు లాంటివేవీ చూడకుండా కేవలం సర్వేలనే శాసనాలుగా భావించి ఆయన అభ్యర్ధులని నిర్ణయిస్తున్నారు

Update: 2024-01-20 06:22 GMT

సాధారణంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా 30% మంది సిటింగ్ అభ్యర్ధులని  మార్చేయడం అనేది జరగదు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ మాత్రం సంకోచించకుండా సిటింగ్ లకు నో చెబుతున్నారు. ఓ కొత్త తరహా రాజకీయానికి తెర తీస్తున్నారు. బంధాలు, బంధువులు, అయిన వాళ్ళు, స్నేహితులు, సామాజిక వర్గ సమీకరణాలు లాంటివేవీ  చూడకుండా కేవలం సర్వేలనే శాసనాలుగా భావించి ఆయన అభ్యర్ధులని నిర్ణయిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ లోనే కాదు బహుశా దేశ రాజకీయాల్లో ఒక విచిత్ర పరిస్థితి.

జగన్ రాజకీయంగా డక్కామొక్కీలు తిన్న వ్యక్తి. తన తండ్రి రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా ఉన్నత స్థానాన్ని అందుకున్న ఆయన కుటుంబం.. వైస్ మరణించిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా ఓదార్పు యాత్ర చేసి, జగన్ ఇబ్బందులు పడ్డారు. పదహారు నెలల జైలు జీవితం ఆయనకు ఎన్నో నేర్పించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2014 లో జరిగిన విభజన బాధిత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారాన్ని తృటిలో కోల్పోయారు.

అనంతరం నారి నుంచి వదిలిన బాణంలా ఆయన అధికార పీఠం వైపు దూసుకుపోయారు. అధికారాన్ని సాధించడం కోసం ఐదేళ్లు చాలా కష్టపడ్డారు అసెంబ్లీలో పోరాడారు. పాదయాత్ర చేశారు. నవరత్నాల హామీలు ఇచ్చి ప్రజల మన్నన పొందారు. ఎన్టీఆర్, వైస్సార్ తర్వాత మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. అద్భుతమైన విజయంతో ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా 23 మంది ఎమ్మెల్యేలు ఆయనకు ఝలక్ ఇచ్చి తెలుగుదేశంలో చేరిపోయారు. ఇది వైకాపా అధినేతను మరింత దృఢంగా మార్చింది. అభ్యర్థుల ఎంపికలో ప్రజాదరణని మాత్రమే ఆయన ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. తరతమ భేదాలు జగన్ కు ఉండవు.

గెలిస్తే చుట్టూ చేరి భజన చేసేవాళ్లు, పదవులు ఆశించే వాళ్ళు, అధికార అడ్డం పెట్టుకొని అడ్డంగా సంపాదించే వాళ్ళే అధికారం కోల్పేతే ఎలా మారిపోతారో ఆయనకు తెలుసు. తాను అధికారానికి దూరమైన మరుక్షణం గెలిచిన ఎమ్మెల్యేలలో ఎంతమంది తనతో ఉంటారో ఎవరికీ తెలియదు. ఎలాంటి ఎమోషన్స్ కి తావు లేకుండా ఆయన నిస్సంకోచంగా చాలామందికి టిక్కెట్లు ఇవ్వలేమని  చెబుతున్నారు. ఈ విషయం తెలిసి ఏమీ చేయలేని పరిస్థితుల్లో కొంతమంది మౌనంగా ఉంటున్నారు. మరి కొందరు మాత్రం అప్పుడే ఆయనపై మాటల దాడిని ప్రారంభించారు. బహుశా దీన్ని కూడా జగన్ ఊహించే ఉంటారు.

14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పరిస్థితిని జగన్ కళ్లారా చూస్తున్నారు. అధికారంలో ఉండగా చంద్రబాబు చుట్టూ తిరిగిన నాయకులు, ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆయన అరెస్టు తర్వాత ఆంటీ ముట్టనట్లు నటించడం జగన్ గమనించారు. అధికారం ఉంటేనే విలువని లేకపోతే ఏ నాయకుడైనా ఒంటరేనని ముఖ్యమంత్రికి తెలుసు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఇప్పుడు తిడుతున్న వాళ్లలో సగం మంది మళ్ళీ తనని ఆశ్రయిస్తారని కూడా జగన్ కు  అర్థమైంది. అందుకే ఓడిపోతారు అనుకున్న ఏ వ్యక్తికి సీటు ఇవ్వడం లేదు. రెక్కల కష్టం మీద గెలిచిన పార్టీని మళ్లీ తన పథకాలు, అధికారంలోకి తీసుకొస్తాయని జగన్ నమ్మకం.అభ్యర్థులకు ప్రజలలో ఉండే వ్యతిరేకత వల్లే పార్టీ ఓడిపోవచ్చని అయన భావిస్తున్నారు.అందుకే డౌట్ ఉన్న అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఐదేళ్లు ప్రతిపక్షనేతగా, మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాకలు తీరిన అనుభవం ఆయనది. ఈ లెక్కలు ఎంతవరకు కరెక్టు అనేది రాబోయే ఎన్నికలు తెలుస్తాయి.

Tags:    

Similar News