ఎన్నికలకు జగన్ ప్లాన్ ఇదే..!
ఎన్నికలకు మరో నెల రోజులే సమయం ఉండటంతో జగన్ కసరత్తును వేగవంతం చేశారు. ఇవాళ కాకినాడలో సమర శంఖారావం సభ నుంచే ఆయన పార్టీ శ్రేణులకు ఎన్నికలకు [more]
ఎన్నికలకు మరో నెల రోజులే సమయం ఉండటంతో జగన్ కసరత్తును వేగవంతం చేశారు. ఇవాళ కాకినాడలో సమర శంఖారావం సభ నుంచే ఆయన పార్టీ శ్రేణులకు ఎన్నికలకు [more]
ఎన్నికలకు మరో నెల రోజులే సమయం ఉండటంతో జగన్ కసరత్తును వేగవంతం చేశారు. ఇవాళ కాకినాడలో సమర శంఖారావం సభ నుంచే ఆయన పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. రేపు, ఎల్లుండి ఆయన పార్టీ అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టానున్నారు. రెండు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసిన అనంతరం ఆయన 14వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 15వ తేదీ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తారు. బస్సుయాత్ర ద్వారానే ఆయన రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే సిద్ధమైంది. ఇక, డేటా చోరీ వ్యవహారంపై వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు.