ఈవీఎంలపై బాబుకు జగన్ సూటి ప్రశ్న
2014 ఎన్నికల్లో, నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబు ఈవీఎంల ద్వారా గెలవలేదా అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు గెలిస్తే ఈవీఎంలు మంచివి, గెలవకపోతే చెడ్డవి ఎలా [more]
2014 ఎన్నికల్లో, నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబు ఈవీఎంల ద్వారా గెలవలేదా అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు గెలిస్తే ఈవీఎంలు మంచివి, గెలవకపోతే చెడ్డవి ఎలా [more]
2014 ఎన్నికల్లో, నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబు ఈవీఎంల ద్వారా గెలవలేదా అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు గెలిస్తే ఈవీఎంలు మంచివి, గెలవకపోతే చెడ్డవి ఎలా అవుతాయని అడిగారు. మంగళవారం రాజ్ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ… 80 శాతం ప్రజలు ఓటు వేశారని, ఓటు వేసిన వారు వీవీప్యాట్ లో ఓటు సరిగ్గా పడిందో లేదో చూసుకున్నారని, ఏ ఒక్క ఓటరు కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. అన్నీ తెలిసిన చంద్రబాబు ఇలా డ్రామాలు చేయడం సబబేనా అని ప్రశ్నించారు. అన్ని పోలింగ్ బూత్ లలో అన్ని పార్టీల ఏజెంట్లు మాక్ పోలింగ్ లో ఓట్లు సరిగ్గా పడుతున్నాయని నిర్ధారించుకున్న తర్వాత పోలింగ్ ప్రారంభమైందని, అయినా చంద్రబాబు ఇలా ఈవీఎంలపై ప్రజలను తప్పుదోవ పట్టించడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయవచ్చా అని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఈవీఎంల ద్వారా గెలవలేదా అని అడిగారు. ప్రజల తీర్పు వ్యతిరేకంగా ఉందనే ఉద్దేశ్యంతో చంద్రబాబు ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడటం తగునా అని అడిగారు. చంద్రబాబు పాలనకు ప్రజలు గుడ్ బై చెప్పారని అన్నారు. ఓడిపోతున్నట్లు తెలిసిన చంద్రబాబు ఈవీఎంలపై నేపం నెడుతున్నారని ఆరోపించారు.