పవన్ బస్సు యాత్ర వాయిదా ఎందుకంటే?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన బస్సు యాత్రను వాయిదా వేశారు. ఎప్పుడు అనేది కూడా చెప్పలేదు

Update: 2022-09-18 13:10 GMT

ఎంతో ఆశగా ఎదురు చూసిన పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలకు నిరాశ మిగిలింది. పవన్ కల్యాణ్ తన బస్సు యాత్రను వాయిదా వేశారు. ఎప్పుడు అనేది కూడా చెప్పలేదు. నిజానికి వచ్చే నెల 5వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే దానిని వాయిదా వేస్తున్నట్లు పవన్ తెలిపారు. తమ నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పారు. లీగల్ సెల్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈలోగా ఆ కార్యక్రమాలను...
ఈలోపు జనవాణి, కౌలు రైతు భరోసా కార్యక్రమాలను పూర్తి చేయాలని అనకుంటున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని పవన్ తెలిపారు. సర్వేల్లో ఈ విషయం స్పష్టమయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని ఒక సర్వేలో తేలిందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నిపుణుల సలహా ప్రకారం ఎక్కడ పార్టీని బలోపేతం చేయాలి? ఎక్కడ బస్సు యాత్ర నిర్వహించాలన్న దానిపై చర్చిస్తున్నామన్నారు. బస్సు యాత్రకు కొంత సమయం తీసుకుంటున్నామని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి....
అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45 నుంచి 67 స్థానాలే వస్తాయని సర్వేలు చెబుతున్నాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు. జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని సర్వేల్లో తేలిందని వివరించారు. 2014లో తాను టీడీపీకి గుడ్డిగా మద్దతివ్వలేదని, భారీ స్థాయిలో కాకుండా చిన్న స్థాయి రాజధానిని ఏర్పాటు చేయాలని సూచించానని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం గురించి జగన్ కు శ్రద్ధ లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగు పెడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


Tags:    

Similar News