మనమే పోటీ చేద్దాం… జనసేన నిర్ణయం

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించింది. బీజేపీతో చర్చలు జరిపి కూటమిగా పోటీ చేయాలని అభిప్రాయపడింది. తిరుపతిలో జరిగిన [more]

Update: 2021-01-22 01:36 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించింది. బీజేపీతో చర్చలు జరిపి కూటమిగా పోటీ చేయాలని అభిప్రాయపడింది. తిరుపతిలో జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్థానిక నేతలు జనసేన అభ్యర్థినే బరిలోకి దించాలని గట్టిగా కోరారు. దీనిపై తాను బీజేపీ అధిష్టానంతో చర్చిస్తానని చెప్పారు. వారం రోజుల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అభ్యర్థి ఎవరైనా కలసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై చలో అసెంబ్లీని కూడా నిర్వహిద్దామని ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ తెలిపినట్లు తెలిసింది.

Tags:    

Similar News