అక్కడే తేల్చుకుంటా
జగన్ ఫ్యాక్షనిజంతో పరిపాలన చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. తన కంపెనీకి చెందిన గనుల లీజును రద్దు చేయడంపై ఆయన స్పందించారు. కేవలం [more]
జగన్ ఫ్యాక్షనిజంతో పరిపాలన చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. తన కంపెనీకి చెందిన గనుల లీజును రద్దు చేయడంపై ఆయన స్పందించారు. కేవలం [more]
జగన్ ఫ్యాక్షనిజంతో పరిపాలన చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. తన కంపెనీకి చెందిన గనుల లీజును రద్దు చేయడంపై ఆయన స్పందించారు. కేవలం తనపై వ్యక్తిగత కక్షతోనే త్రిశూల్ కంపెనీ లీజును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కేవలం పగతోనే తమ కంపెనీకి చెందిన లీజులు రద్దు చేశారని, అంతా సవ్యంగా ఉన్నా లీజులు ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటానని జేసీ తెలిపారు. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. జేసీ దివాకర్ రెడ్డి కి చెందిన త్రిశూల్ కంపెనీ గనుల లీజును నిన్న జగన్ ప్రభుత్వం రద్దు చేసిిన సంగతి తెలిసిందే.