నిరసనలు వేస్ట్.. నాలుగేళ్ల తర్వాత చూసుకోవచ్చు

టీడీపీ నేతల అరెస్ట్ లకు నిరసనలు తెలియజేయడం వేస్ట్ అని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. నాలుగేళ్ల తర్వాత ఏమైనా ఉంటే చూసుకోవచ్చని ఆయన [more]

Update: 2020-06-13 05:07 GMT

టీడీపీ నేతల అరెస్ట్ లకు నిరసనలు తెలియజేయడం వేస్ట్ అని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. నాలుగేళ్ల తర్వాత ఏమైనా ఉంటే చూసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్ని నిరసనలు తెలియజేసినా ప్రయోజనం లేదని, జగన్ వాటిని పట్టించుకోరని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై నిరసనలు తెలియజేయడం వృధా అని ఆయన టీడీపీ నేతలకు సూచించారు. రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు పెడుతున్నా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు జేసీ దివాకర్ రెడ్డి. రాజ్యాంగం లేదు.. రూల్స్ లేవన్నారు. శివయ్య లేడు.ఏసుక్రీస్తు లేడు.. అల్లాలేడు అని జేసీ దివాకర్ రెడ్డి నిర్వేదం చెందారు. ఈ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందన్నారు. ఆయన తలచుకుంటే దెబ్బలకు కొదవేమీ ఉండదన్నారు. అధికారుల నడుం విరిగిపోయిందన్నారు.

Tags:    

Similar News