జేసీ షాకింగ్ కామెంట్స్.. మరోసారి అవకాశమివ్వాలంటూ

మళ్లీ నామినేషన్లకు అవకాశమిస్తే తాడిపత్రిలో పోటీ చేస్తామని మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి కోరారు. గతంలో నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు తమ [more]

Update: 2021-02-19 08:44 GMT

మళ్లీ నామినేషన్లకు అవకాశమిస్తే తాడిపత్రిలో పోటీ చేస్తామని మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి కోరారు. గతంలో నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు తమ పార్టీ వారిని బెదిరించారన్నారు. స్వయంగా ఎమ్మెల్యే బెదిరించారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గతంలో పోటీ చేయలేకపోయిన వారికి మళ్లీ నామినేషన్ వేసే అవకాశం ఇవ్వాలని జేసీ దివాకర్ రెడ్డి కోరారు. వాలంటీర్లను ఇక్కడ ఎన్నికల సమయంలో ఉంచకుండా పక్క ప్రాంతానికి పంపాలని జేసీ దివాకర్ రెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అన్నీ తప్పుడు లెక్కలేనని ఆయన అభిప్రాయ పడ్డారు.

Tags:    

Similar News