జగన్ పై జేసీ సంచలన ఆరోపణలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ని వాడు.. వీడు అంటూ [more]

;

Update: 2018-12-26 10:44 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ని వాడు.. వీడు అంటూ దూషించారు. బుధవారం అనంతపురంలో జరిగిన ధర్మ పోరాట దీక్షలో జేసీ మాట్లాడుతూ… జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులం పేరుతో గెలవాలని చూస్తున్నారన్నారు. టిక్కెట్ కోసం జగన్ 10 కోట్లు అడుగుతున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, అందరూ బాగుండాలన్నా, సౌభాగ్యం రావాలన్నా, దారిద్ర్యం పోవాలన్నా… ఇష్టమైనా, కష్టమైనా, నష్టమైనా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిందేన్నారు. అనంతపురం జిల్లాకు నీళ్లిచ్చిన ఘనత చంద్రబాబుదేనని ప్రశంసించారు. వచ్చేసారి చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లో నుంచి రిటైర్ అయ్యి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలని సూచించారు.

Tags:    

Similar News