గోకుల్ చాట్, లుంబిని పార్క్ పేలుళ్ల కేసులో తీర్పును వచ్చే నెల 4కు వాయిదా వేసింది కోర్టు. ఈ కేసులో 11 మందిపై ఎన్ఐఏ అభియోగాలు మోపగా ఏడుగురిని గుర్తించారు. మరో నలుగురు నిందితులను గుర్తించలేదు. 11 ఏళ్ల సుదీర్ఘకాలం ఈ కేసు విచారణ జరిగింది. ప్రస్తుతం నిందితులు చర్లపల్లిలో అత్యంత భద్రత నడుమ వారిని ఉంచారు. ఇప్పటికే విచారణ పూర్తయిన కేసులో వచ్చే 4న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే, ఇవాళ తీర్పు ఉంటుందని, నిందితులకు కఠిన శిక్ష పడాలని భావించిన క్షతగాత్రులు కోర్టు వద్దకు పెద్దసంఖ్యలో వచ్చి ఎదురుచూశారు. నిందితులకు మరణశిక్ష విధించాలని వారు కోరుతున్నారు.