జస్టిస్ ఎన్వీరమణ vs శ్రీరాం పంచు
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ఎన్ వి రమణ ను ఎస్ ఐఎంసీకి నియామకం చేసినందుకు నిరసనగా,భారత మధ్యవర్తిత్వ లాయర్ గా పేరుగాంచిన సీనియర్ అడ్వకేట్ శ్రీరాం పంచు సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ప్రాక్టిషనర్ పదవికి రాజీనామా చేశారు.
జస్టిస్ ఎన్వీరమణ vs శ్రీరాం పంచు
ఆయనకున్న అర్హతలేంటి ?
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ఎన్ వి రమణ ను ఎస్ ఐఎంసీకి నియామకం చేసినందుకు నిరసనగా,భారత మధ్యవర్తిత్వ లాయర్ గా పేరుగాంచిన సీనియర్ అడ్వకేట్ శ్రీరాం పంచు సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ప్రాక్టిషనర్ పదవికి రాజీనామా చేశారు. సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రానికి (SIMC) ఇ-మెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు.
అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని భారత దేశంలో మొదటిసారిగా 2021 డిసెంబరులో అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎన్ వీ రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావ్ సంయుక్తంగా ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రపంచస్థాయి మధ్యవర్తిత్వ కేంద్రాన్ని హైదరాబాద్ లో నెలకొల్పడానికి ముందుకొచ్చింది. ఆ కేంద్రాన్ని ప్రారంభ సభలో జస్టిస్ రమణ మాట్లాడుతూ ఏఐఎంసీ మధ్యవర్తిత్వ కేంద్రం భారత్ లోనే కాకుండా, ప్రపంచంలోనే ప్రధాన మధ్యవర్తిత్వ కేంద్రంగా ఉంటుందనన్నారు. ఆపై 6 నెలలకు జూన్ 2022లో శ్రీరాం పంచు ‘ది వైర్’ లో ఆర్టికల్ ప్రచురిస్తూ భారతదేశంలో కేసుల సత్వర పరిష్కారానికి ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కేంద్రం రిటైర్ జడ్జిల చేతుల్లోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. జస్టిస్ రమణ రిటైర్మెంట్ అనంతరం లాభం పొందేంతుకు తన సహచర న్యాయమూర్తులకు లాభం చేకూర్చేందుకు న్యాయస్థాన కార్యాలయాన్ని వాడుకుంటున్నారని ఆయన తన వ్యాసంలో ఆరోపించారు. అలాగే న్యాయవాదులు, న్యాయమూర్తులపై ఆయన అనేక ఆరోపణలు చేయడంతో వీరిద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. జస్టిస్ రమణ పదవీ విరమణ అనంతరం ఆగస్టులో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ప్యానెల్ ఎస్ ఐ ఎంసీ చైర్మన్ జార్జి లిమ్ ఆయనను మధ్యవర్తిత్వం నెరిపేందుకు నియామకం చేశారు. దీంతో అదే ప్యానెల్ లో మెంబర్ అయిన పంచు తన పదవికి రాజీనామా చేస్తూ మాజీ న్యాయమూర్తిని ఏ విధంగా నియామకం చేశారని ఘాటు పదాలతో ప్రశ్నిస్తూ ఇ- మెయిల్ చేశారు.
ఎస్ ఐఎంసీ కార్యదర్శికి పంచు ఇ- మెయిల్ చేసిన లేఖలో భారత ప్రధాన న్యాయమూర్తిగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ‘ది ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మిడియేషన్ సెంటర్’ కు చాలా నష్టం చేకూర్చారని, దానిని ప్రైవేటు సంస్థగా రూపొందించారని, కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం నెరపేందుకు ఆయనకున్న అర్హతలేంటని పంచు ప్రశ్నించారు. ఆయన మధ్యవర్తిత్వం నెరపి పరిష్కరించిన కేసులేవీ లేవని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా న్యాయవ్యవస్థ కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపణలు చేశారు. వివాదానికి కేంద్రమైన మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నియామకం తీవ్ర ప్రశ్నలకు తెరలేపుతుందన్నారు.
ముసాయిదా, నియామకాలు
ఐఏఎంసీ కోసం 2021 ఆగస్టులో ముసాయిదాను రూపొందించారని, ఆ విశ్వాస ఒడంబికను రూపొందించింది రమణే నని, ఐఏఏంసీ ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ గా నెలకొల్పారని, దేశంలో న్యాయ సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయంగా సత్వర న్యాయం కోసం దీనిని ఏర్పాటు చేశారన్నారు. బోర్డు సభ్యులను కూడా జస్టిస్ రమణే నియామకం చేశారని, అందులో ఇద్దరు జీవితకాల ట్రస్టీలుగా జస్టిస్ నాగేశ్వరరావు, (ప్రస్తుత సుప్రీంకోర్టుజడ్జి) రిటైర్డ్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ వీరిద్దరు జీవిత కాలం (వాళ్లు రిజైన్ చేసేవరకు) కొనసాగుతారని పంచు వివరించారు. బోర్డులో మరో ఇద్దరు ఎక్స్ అఫీసియో ట్రస్టీలుగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమ కోహ్లి, లా మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారన్నారు. అయితే జస్టిస్ రమణ బోర్డు సభ్యులుగా లేరన్నారు. ట్రస్ట్ దాత, ముసాయిదా రచయిత, సంస్థ ప్రారంభం తర్వాత తన పాత్ర ఏమిటో చెప్పలేదని, వాస్తవానికి ట్రస్ట్ ఏర్పాటు చేసిన వారు ట్రస్టీగా కొనసాగుతారన్నారు.
ట్రస్ట్ దస్తావేజులు కూడా ట్రస్ట్ రద్దు చేయలేని నిబంధనను ప్రత్యేకంగా పేర్కొంటూ, "రద్దు చేసిన సందర్భంలో, ట్రస్ట్ అన్ని ఆస్తులు వ్యక్తులు లేదా ట్రస్ట్ లేదా ట్రస్ట్ సారూప్యాలను కలిగి ఉన్న సంఘానికి బదిలీ చేయబడతాయి" అని ముసాయిదా పేర్కొందని పంచు వివరించారు.
మధ్యవర్తిత్వం ఎలా పనిచేస్తుంది ?
కోర్టుల్లో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పేరుకు పోవడంతో సత్వర పరిష్కారం కోసం న్యాయమూర్తులు మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. వాణిజ్య లావాదేవీలు, కార్యాలయ సంబంధిత, కుటుంబ విషయాలు మొదలైన కేసులను ఇందులో పరిష్కరిస్తారు.
మధ్యవర్తిత్వం - అర్హత
సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వం సమన్వయ ప్రాజెక్ట్ కమిటీ నిర్దేశించిన 40 గంటల శిక్షణ పొందిన వ్యక్తి ఎవరైనా మధ్యవర్తి కావచ్చు. ఎవరైనా కేసులను పరిష్కరించే "అర్హత కలిగిన మధ్యవర్తి"గా గుర్తింపు పొందేందుకు అర్హత పొందేందుకు కనీసం 10 నుంచి 20 మధ్యవర్తిత్వాలు నెరపి ఉండాలి.
మధ్యవర్తిత్వం అనేది న్యాయస్థానం నుండి భిన్నంగా ఉంటుంది, ఇది ఎటువంటి కఠినమైన విధి విధానాలు లేని అనధికారిక ప్రక్రియ. ఇది పూర్తిగా గోప్యమైనది. నిష్పక్షపాతంగా, తటస్థంగా, రెండు పార్టీలు మధ్యవర్తి సమక్షంలో ఒకరితో ఒకరు పరస్పరం సహకరించుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసిందే మధ్యవర్తిత్వం.