జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత
తమిళనాడు మాజీ చీఫ్ జస్టీస్, మాజీ లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి(76) కన్నుమూశారు. అనారోగ్యంతో నెలరోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుసత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస [more]
తమిళనాడు మాజీ చీఫ్ జస్టీస్, మాజీ లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి(76) కన్నుమూశారు. అనారోగ్యంతో నెలరోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుసత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస [more]
తమిళనాడు మాజీ చీఫ్ జస్టీస్, మాజీ లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి(76) కన్నుమూశారు. అనారోగ్యంతో నెలరోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుసత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. హైదరాబాద్ అంబర్ పేటలో జన్మించిన సుభాషణ్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత తమిళనాడు హైకోర్టు చీఫ్ జస్టీస్ గా, ఉమ్మడి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ గా పనిచేశారు. సుభాషణ్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. న్యాయపరంగా సుభాషణ్ రెడ్డి మృతి తీరని లోటని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా, లోకాయుక్తగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరపాలని కేసీఆర్ ఆదేశించారు.