కనుమరుగు కానున్న కడప.. ఇక చరిత్రకే పరిమితమా !
మొన్నటి వరకూ కడప, ఆ తర్వాత వైఎస్సార్ కడప జిల్లాగా ఉన్న కడప.. కొత్త జిల్లాల విభజనతో తన ఉనికిని కోల్పోయి.. చరిత్రకే పరిమితం
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్త జిల్లాల ఏర్పాటుపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను విభజించిన తీరుపై కొందరు హర్షం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రాలు, ప్రాంతాలను ఇతర జిల్లాల్లో కలపడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. తమ జిల్లాలకు ఫలానా పేరు పెట్టాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి.
కాగా.. సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడప పూర్తిగా కనుమరుగు అవ్వనుంది. ఈ జిల్లాను రెండు ముక్కలు చేయబోతోంది ప్రభుత్వం. రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, మరో భాగానికి వైఎస్సార్ జిల్లాగా నామకరణం చేసింది. మొన్నటి వరకూ కడప, ఆ తర్వాత వైఎస్సార్ కడప జిల్లాగా ఉన్న కడప.. కొత్త జిల్లాల విభజనతో తన ఉనికిని కోల్పోయి.. చరిత్రకే పరిమితం కానుంది. కడప అంటే తిరుమలకు తొలి గడపగా భావించే వెంకన్న భక్తులు.. కడప జిల్లాను రెండుగా విభజించడం, విభజనలోనూ జిల్లా పేరు లేకుండా చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.