కమల్ కు మోదీ…?

ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అరుదైన ఆహ్వానం కమల్ హాసన్ కు అందింది. కమల్ హాసన్ తమిళనాడులో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పెట్టి పోటీ [more]

Update: 2019-05-27 12:16 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అరుదైన ఆహ్వానం కమల్ హాసన్ కు అందింది. కమల్ హాసన్ తమిళనాడులో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పెట్టి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ ను తమిళులు ఆదరించలేదు. ఏ ఒక్కరూ గెలవలేదు. తమిళనాడులో ప్రచారం సందర్భంగా మోదీపైనా, బీజేపీపైనా కమల్ హాసన్ తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అలాగే గాడ్సే పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. అయితే ఈ నెల 30వ తేదీన రాష్ట్ర పతి భవన్ లో జరిగే మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి కమల్ హాసన్ కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరి ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ హాజరవుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News