జగన్ కు నటన తెలీదు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సత్వర సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంటారని, చంద్రబాబు లాగా నటన తెలియదని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. వరద నష్టాన్ని పరిశీలించేందుకు [more]

Update: 2020-11-30 07:14 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సత్వర సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంటారని, చంద్రబాబు లాగా నటన తెలియదని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. వరద నష్టాన్ని పరిశీలించేందుకు జగన్ ఏరియల్ సర్వేకు వెళితే దానిని గాలి పర్యటనగా లోకేష్ అనడంపై కన్నబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు ఎన్నిసార్లు ఏరియల్ సర్వేలకు వెళ్లలేదని కన్నబాబు నిలదీశారు ఈ సందర్భంగా ఫొటోలను ప్రదర్శించారు. హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు అక్కడకు వెళ్లి కరెంట్ తీగలు బిగించడం, అక్కడే ఉండి ప్రజలను ఏదో చేశానని నమ్మించడం వంటి నటనలను చంద్రబాబులాగా జగన్ చేయలేరన్నారు. ఆయన దృష్టంతా బాధితులను ఆదుకోవడంపైనే ఉంటుందన్నారు. చంద్రబాబు, లోకేష్ లు రోజూ బకెట్ బురద తీసుకుని ప్రభుత్వంపై చల్లేందుకు తిరుగుతున్నారన్నారు.

Tags:    

Similar News