కర్ణాటకలో ఉప ఎన్నికలు వాయిదా

కర్ణాటకలో జరగనున్న ఉప ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ ఉప [more]

Update: 2019-09-26 11:42 GMT

కర్ణాటకలో జరగనున్న ఉప ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ ఉప ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఎన్నికల కమిషన్ వివరించింది. కర్ణాటకలో పదిహేను స్థానాలకు ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 21వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టులో అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలపై విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టులో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యే అంశంపై తీర్పు వచ్చే వరకూ వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Tags:    

Similar News