మెగాస్టార్ కి పునర్జన్మ

అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన టీవీ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతి గురించి దేశవాసులకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. సరిగ్గా ఇరవై మూడేళ్ల కిందట వచ్చిన ఈ పాపులర్‌ గేమ్‌ షో ఒక తరం ప్రేక్షకుల మీద అత్యంత ప్రభావం చూపింది. కొన్నాళ్ల పాటు ‘కబీసీలో గెలుపు కోసం’ అంటూ కరెంట్‌ అఫైర్స్‌ పుస్తకాలు కూడా వచ్చాయి. వందలాది మందిని లక్షాధికారులను, పదుల సంఖ్యలో కోటీశ్వరులను చేసిన రియాలిటీ షో ఇది. మొత్తం పదిహేను సిరీస్‌లుగా నడిచిన ‘కరోడ్‌పతి’ మొన్న (డిసెంబర్‌ 29) తన ప్రయాణాన్ని శాశ్వతంగా ముగించింది.

Update: 2023-12-31 12:42 GMT

 KBC 

ఒక్క మూడో సిరీస్‌ తప్పించి, మిగిలిన 14 షోలకు అమితాబ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించడం విశేషం. మూడో సిరీస్‌కు మాత్రం బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ హోస్ట్‌గా పనిచేశారు. ‘హూ విల్‌ బి ద మిలియనీర్‌’ అనే బ్రిటిష్‌ గేమ్‌ షో ఆధారంగా, ప్రముఖ క్విజ్‌ మాస్టర్‌ సిద్ధార్ధ బసు ఆధ్వర్యంలో ఇది రూపుదిద్దుకుంది. తొలుత ఈ షోలో చేయడానికి అమితాబ్‌ అంగీకరించలేదు. కొన్ని మార్పులు, చేర్పులు చేసిన తర్వాత ఆయన ఇందులో భాగస్వాములయ్యారు.

2000 నాటికి అమితాబ్‌ ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఆయన స్థాపించిన అమితాబ్‌ బచ్చన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏబీసీఎల్‌) నష్టాల్లో ఉంది. ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. అప్పులు ఎక్కువయ్యాయి. రుణదాతలు బిగ్‌ బి ఇంటికి వెళ్లి గొడవ చేసే పరిస్థితి తలెత్తింది. వంద కోట్ల అప్పుతో, అవమానాలతో ఆయన జీవితం దుర్భరమైపోయింది. ఆ టైమ్‌లో 2000 జులై మూడున  మొదలైన కేబీసీ సామాన్యుల జీవితాలనే కాదు, అమితాబ్‌ తలరాతను కూడా మార్చేసింది. అచేతనావస్థలోకి వెళ్లిపోయిన ఆయన్ను మరోసారి మెగాస్టార్‌ను చేసింది. ఈ రోజు బాలీవుడ్‌ మెగాస్టార్‌ పది ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు. వంద కోట్ల అప్పు నుంచి 3500 కోట్ల ఆస్తిని సంపాదించే స్థాయికి చేరుకున్నారు. అమితాబ్‌ ఇమేజ్‌ను పదింతలు పెంచింది ఈ గేమ్‌ షో.

మొదటి సిరీస్‌లో కోటి రూపాయల ప్రైజ్‌ మనీతో ప్రారంభమైన కేబీసీ ఇప్పుడు 15 ప్రశ్నలకూ సరిగ్గా సమాధానం చెప్పే వారికి ఏడు కోట్ల రూపాయలను ఆఫర్‌ చేస్తోంది. అమితాబ్‌ వ్యాఖ్యానం, ఆయన హాస్యం, హాజరయ్యే వారి ఆనందాలు, కష్టాలు, కన్నీళ్లు, కేబీసీ షోలో జరిగే వేడుకలు, పండుగలు, సెలబ్రిటీలతో నడిచే షోలు... ఇవన్నీ ఈ గేమ్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఇక ఈ షో ఉండదు అనే మాట చాలామందికి చేదులా అనిపిస్తోంది. కానీ అమితాబ్‌ చెప్పినట్లు, మొదలయ్యాక అంతం కూడా ఉంటుంది కదా..! అది టీవీ షో అయినా... జీవితమైనా! కంగ్రాట్స్‌ అమితాబ్‌జీ. మిమ్మల్నీ మరచిపోలేం. మీ కేబీసీని మరచిపోలేం.

Tags:    

Similar News