రేపటి నుంచే రైతు రుణమాఫీ

రేపటి నుంచి తెలంగాణలో రైతు రుణ మాఫీ అమలుకానుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. యాభై వేల రూపాయల లోపు రుణాన్ని మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత దశలవారీగా [more]

Update: 2021-08-15 05:24 GMT

రేపటి నుంచి తెలంగాణలో రైతు రుణ మాఫీ అమలుకానుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. యాభై వేల రూపాయల లోపు రుణాన్ని మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత దశలవారీగా మిగిలిన రుణమాఫీ కూడా జరుగుతుందని కేసీఆర్ తెలిపారు. గోల్కొండ కోటలో కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించామన్నారు. విద్యుత్తురంగంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చామన్నారు. వ్యవసాయ రంగం కోసం అనేక ప్రాజెక్టులను నిర్మించామన్నారు. ఇప్పుడు తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించిందని కేసీఆర్ తెలిపారు. చేనేత కార్మికులకు కూడా ఆసరా పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. కొత్తరేషన్ కార్డులను కూడా మంజూరు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ ఉత్తమ స్థానాన్ని సాధిస్తుందని కేసీఆర్ వెల్లడించారు. ముందుచూపుతో, ప్రణాళిక బద్దంగా వెళ్లడం వల్లనే అభివృద్ధి సాధ్యమయిందన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాకు ఒక వైద్య కళాశాలను స్థాపిస్థామని చెప్పారు.

Tags:    

Similar News