మరో 20ఏళ్లు అధికారం టీఆర్ఎస్ దే

తెలంగాణలో మరో ఇరవై ఏళ్ల పాటు అధికారం టీఆర్ఎస్ దేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. విపక్షాల విమర్శలను [more]

Update: 2021-08-24 13:00 GMT

తెలంగాణలో మరో ఇరవై ఏళ్ల పాటు అధికారం టీఆర్ఎస్ దేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. విపక్షాల విమర్శలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. అన్ని వర్గాలకు టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తుందన్నారు. దళిత బంధు పథకం ప్రతిష్టాత్మకమైనది, దీనిపై అందరూ అవగాహన పెంచుకుని ప్రజల్లో చైతన్యం కల్పించాలని కేసీఆర్ కోరారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నేతలు చర్యలు చేపట్టాలని కోరారు. తాను సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళిత చైతన్య యాత్రను ప్రారంభించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఎవరూ విమర్శలకు వెరవవద్దని ఏ ఎన్నిక అయినా మనదే విజయమని ఆయన చెప్పారు.

Tags:    

Similar News