దళిత బంధుకోసం మరో నాలుగు జిల్లాల ఎంపిక

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దళిత బంధు పథకం అమలుకు మరో నాలుగు జిల్లాలను ఎంపిక చేశారు. ఈ నాలుగు జిల్లాల్లో దళిత [more]

Update: 2021-09-01 06:29 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దళిత బంధు పథకం అమలుకు మరో నాలుగు జిల్లాలను ఎంపిక చేశారు. ఈ నాలుగు జిల్లాల్లో దళిత శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో నాలుగు మండలాలను కేసీఆర్ ఎంపిక చేశారు. ఈ నాలుగు మండలాల్లో దళిత బంధు పథకం అమలు చేయాలని, వారికి ముందుగా ఈ పథకంపై అవగాహన కల్పించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని, తుంగతుర్తి మండల తిర్మలగిరి, సూర్యాపేట జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలోని తిర్మలగిరి, నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో చారొగాం, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో నిజాంసాగర్ మండలాలను కేసీఆర్ ఎంపిక చేశారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులతో ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ సమీక్ష జరుపుతారు.

Tags:    

Similar News