ప్రధానిని కేసీఆర్ ఏం కోరారంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర అవసరాల గురించి ఆయనతో చర్చించారు. మొత్తం 15 పేజీలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధాని మోదీకి సమర్పించారు. [more]

Update: 2021-09-03 12:24 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర అవసరాల గురించి ఆయనతో చర్చించారు. మొత్తం 15 పేజీలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధాని మోదీకి సమర్పించారు. వరంగల్ లో టెక్స్ టైల్స్ పార్క్ కు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. పది అంశాలను వినతి పత్రంలో తెలిపారు. ప్రధానంగా కృష్ణా, గోదావరి గెజిట్ పై చర్చించారు. అలాగే కొత్త జిల్లాలకు ఐపీఎస్ లను కేటాయించాలని కోారరు. అలాగే కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ పాఠశాలలను కేటాయించాలని కేసీఆర్ ప్రధానిని కోరారు. హైదరాబాద్ – నాగపూర్ ఇండ్రస్ట్రియల్ కారిడార్ ను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ తో పాటు కరీంనగర్ కు ఐఐఐటీ ఇవ్వాలని కేసీఆర్ ప్రధానిని కోరారు.

Tags:    

Similar News